జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) 2024 ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.ప్రధానంగా వైసీపీ రెండోసారి అధికారంలోకి రాకూడదని కంకణం కట్టుకున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తెలుగుదేశం మరియు బీజేపీ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కూటమి ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు.2019 ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చెందడంతో ఈసారి పిఠాపురం( Pithapuram ) నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.ఎట్టి పరిస్థితులలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉండగా తాజాగా జనసేన పార్టీ( Janasena Party ) కార్యకర్తలు మరియు నాయకులకు పవన్ కళ్యాణ్ కీలక సందేశం పంపించారు.
పొత్తు ధర్మాన్ని పాటిద్దాం… కూటమిని గెలిపిద్దామని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి పెట్టుకున్నట్లు తెలిపారు.పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.మూడు పార్టీలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.
ఎక్కడా కూడా వివాదాలకు చోటు ఇవ్వకుండా అందరితో కలసి గెలుపుకు కృషి చేయాలని కేడర్ కి సూచించారు.ఇదిలా ఉంటే ఈ నెల 30వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.
ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో మూడు రోజులపాటు ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం.ఆ తర్వాత పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు.