గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవుతున్న సందర్భంగా ఈ మూవీపై అప్డేట్స్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నారు.హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సెకండ్ మూవీగా భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్లాన్ చేశారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.సినిమా గురించి ఏదైనా స్పెషల్ అప్డేట్ ఇవ్వాలని హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
దానికి హారీష్ శంకర్ ఓ వాయిస్ మెసేజ్ ద్వారా స్పందించారు.
సినిమా లో టైమింగ్ ఎంత ఇంపార్టెంటో.
సినిమాకు టైమింగ్ అంత ఇంపార్టెంట్ అంటూ భవదీయుడు భగత్ సింగ్ గురించి త్వరలొనే ఓ మంచి అప్డేట్ వస్తుందని హరీష్ శంకర్ చెప్పారు.హరీష్ శంకర్ వాయిస్ మెసేజ్ పీ.కే ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి అయ్యేలా చేసింది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ని పూర్తి చేసి క్రిష్ డైరక్షన్ లో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టాడు.
గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవడంతో భవదీయుడు భగత్ సింగ్ మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ తారాస్థాయి అంచనాలు ఏర్పరచుకున్నారు.