Pawan Kalyan : పవన్ మళ్లీ అక్కడి నుంచే పోటీ ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేది అందరికీ ఆసక్తికరంగానే ఉంది.2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక ,భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్ల ఓటమి చెందారు.జనసేన ఒంటరిగా పోటీ చేయడంతో పవన్ ఓటమి చెందాల్సి వచ్చింది.అయితే ఈసారి టిడిపీ, బిజెపి పొత్తుతో ఎన్నికలకు వెళ్ళబోతున్న క్రమంలో తన గెలుపు నల్లేరు మీద నడకే అని పవన్ భావిస్తున్నారు.

 Pawan Kalyan : పవన్ మళ్లీ అక్కడి నుంచే �-TeluguStop.com

ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలిచి తీరుతాననే నమ్మకంతో పవన్  ఉన్నారు.పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో పవన్ ఉన్నారట .

Telugu Ap, Janasena, Janasenani, Pavankalyan, Pawan Kalyan, Telugudesam, Ysrcp-P

 ఈ మేరకు అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు .అయితే పవన్ ఒకచోట ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేక గత ఎన్నికల మాదిరిగా రెండు చోట్ల పోటీ చేస్తారా అనేది తేలల్సి ఉంది.అయితే పవన్ సన్నిహిత వర్గాలు మాత్రం ఆయన ఒక్కచోట నుంచి పోటీ చేస్తారని , అది భీమవరం అని చెబుతున్నారు.  అంతేకాకుండా భీమవరంలో పవన్ నివాసం కూడా ఉండేందుకు ఒక ఇంటిని చూస్తున్నారని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.

నిన్ననే పవన్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.మంగళవారం విశాఖపట్నం( Visakhapatnam ) కి వెళ్ళిన పవన్ అక్కడ వివిధ నియోజకవర్గాల నాయకులతో ఎన్నికల వ్యవహాలపై చర్చించారు.

ఈ సందర్భంగా కొంతమంది అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లుగా ప్రచారం జరిగింది.

Telugu Ap, Janasena, Janasenani, Pavankalyan, Pawan Kalyan, Telugudesam, Ysrcp-P

 ఇక ఆ తరువాత భీమవరం వెళ్ళిన పవన్ అక్కడ టిడిపి ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షురాలు , భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి అయిన తోట సీతారామలక్ష్మి నివాసానికి పవన్ వెళ్లారు .ఈ సందర్భంగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు( Nimmala Ramanaidu ) తోపాటు మరికొంతమంది నేతలు పవన్ తో సమావేశం అయ్యారు.ఈసారి తాను భీమవరం నుంచే పోటీ చేస్తానని ,తనకు అంతా సహకరించాలని పవన్ టిడిపి నేతలకు విజ్ఞప్తి చేశారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube