డాన్స్ తో అదరగొట్టిన పాట్ కమిన్స్.. వీడియో వైరల్.. .

ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్( Sunrisers Hyderabad) జట్టు ఏ రేంజ్ లో పర్ఫామెన్స్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రత్యర్థి బౌలర్లు బౌలింగ్ వేయడానికి భయపడేటట్లుగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్ మెన్స్ వీరవిహారం సృష్టిస్తున్నారు.

 Pat Cummins, Danced To The Beat.. Video Viral , Dance, Ipl 2024, Pat Cummins, S-TeluguStop.com

ఈ దెబ్బతో ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 మ్యాచ్లలో ఏడు మ్యాచ్లను గెలుపొంది 14 పాయింట్స్ మూడో స్థానంలో ఉంది.ఇకపోతే తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ కేవలం గ్రౌండ్ లో మాత్రమే కాకుండా మిగతా అంశాలలో కూడా దూసుకుపోతున్నాడు.

తాజాగా ఆయన చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

వైరల్ గా మారిన వీడియోలో కమిన్స్ దేశవాళి స్టైల్ లో డాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు.షాహిద్ కపూర్ మరియు కృతి సనన్ నటించిన ‘తేరీ బాటన్ మే ఉల్జా జియా’చిత్రంలోని లాల్ పీలీ అఖియాన్ పాటకు పాట్ కమ్మిన్స్ అదిరిపోయే డ్యాన్స్ చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదిస్తుంది.

ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్ డాన్స్ వేయడంతో క్రికెట్ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ వీడియో లక్నోతో మ్యాచ్ జరగక ముందుది.ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ కెప్టెన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.హీరోలకు తగ్గకుండా డాన్స్ స్టెప్స్ వేశాడని పలువురు కామెంట్ చేస్తుండగా.

మరికొందరు సినిమాల్లో ట్రై చేయమంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube