నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుండి మన సరిహద్దు దేశమైన పాకిస్థాన్ కు చెమటలు పట్టడం మొదలైంది.అందుకే మోడీని భారతీయులలో చులకన చేయడానికి పాకిస్తాన్ పటాన్ కోట్ లో ఉగ్రవాదులతో దాడి చేయించింది.
దీనికి భారత్ దీటైన సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్న పాకిస్తాన్ ఎన్నికల సమయం వచ్చేంతవరకు సైలెంట్ అయిపోయింది.ఆతర్వాత పుల్వామా దాడి చేసింది.
ఈ దాడికి ప్రతిగా భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ 2 దెబ్బకు పాకిస్తాన్ అంతర్జాతీయ స్థాయిలో బఫూన్ అయింది.దాన్ని కవర్ చేసుకోవడం కోసం అమెరికా ఇచ్చిన ఎఫ్16 యుద్ధ విమానాలను భారత్ పైకి తీసుకువచ్చింది.
వాటిని రేడర్ ద్వారా గుర్తించిన భారత యుద్ధ విమానాలు వాటిని వెంటపడి తమ సరిహద్దుల వరకు తరిమాయి.ఈ సమయంలోనే భారత్ పైలెట్ అభినందన్ పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి ఆతరువాత తన యుద్ధ విమానం కూలడంతో ఆయన పాక్ సైనికులకు చిక్కారు.
ఈ సంఘటన జరిగాక పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఇమ్రాన్ ఖాన్ హాజరవ్వలేదు.ఆ సమావేశంలో వింగ్ కమాండర్ అభినందన్ ను విడుదల చేయకుంటే భారత్ మనపై యుద్ధానికి రావడానికి రెడీ అవుతుందనే విషయాన్ని ఖురేషీ మాకు తెలిపారు.
ఆ మాటలు విన్న బాజ్వా కాళ్లు వణకడం, చెమటలు పట్టడం చూశానని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేత అయాజ్ సాదిఖ్ తాజాగా పాకిస్తాన్ పార్లమెంట్ లో వెల్లడించారు.