జైలు జీవితం.చాలా దారుణమైన జీవితం.
అలాంటి ఈ జైలుకు కొందరు ఎలాంటి నేరం చెయ్యకుండానే శిక్ష అనుభవిస్తుంటారు.మరికొందరు తప్పు చేసిన సరే తప్పించుకుంటుంటారు.
అలాంటిది ఓ వ్యక్తి తప్పు చేశాడు.తప్పు చేసినట్టు అతనే ఒప్పుకున్నాడు.
కానీ జడ్జీలు మాత్రం అతన్ని వదిలేసారు.
ఎందుకు అతన్ని వదిలేశారు ? అసలు కథ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్న. ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా అనే ప్రాంతంలో పీటన్ జాన్ వ్యక్తి టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.అయితే ఆ వ్యక్తి కొందరి విద్యార్థినులను, ఉపాధ్యాయినిలను లైంగికంగా వేధించేవాడు.
దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే అరెస్ట్ చేసే సమయంలో అతను సాధారణ బరువుతోనే ఉన్నాడు.
కానీ కోర్టు అతన్ని విచారించే సమయానికి అతను కదలలేనంత లావు అయిపోయాడు.దీంతో అతను కోర్టులో నిజం ఒప్పుకున్నప్పటికి అతని శిక్ష వేస్తే భారీ మొత్తంలో అనవసరంగా ఖర్చు చెయ్యాల్సి ఉంటుందని, అతని అతి బరువు కారణంగా అతనిపై స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుందని జడ్జి సంచలనం నిర్ణయం తీసుకున్నారు.
అతనికి ఎటువంటి శిక్ష వెయ్యకూడదు అని నిర్ణయించుకున్నారు.అయితే ఎటువంటి శిక్ష వెయ్యకపోతే కోర్టుకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుందని అందుకోసం అయినా అతనికి శిక్ష విధించాలని, త్వరలోనే అతనికి శిక్ష విధిస్తామని జడ్జి తెలిపారు.
అతను అతి తక్కువ సమయంలోనే భారీగా లావు అవ్వడం వల్ల తాత్కాలికంగా అతని శిక్ష నుంచి తప్పించుకున్నాడు.