నిన్న జరిగిన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మీట్ వాడి వేడిగా జరిగింది.ఈ మీట్ లో రాహుల్ గాంధీ నాయకత్వ మార్పు పై సోనియా గాంధీకి లేఖ రాసిన వారు బిజేపి సూచనల మేర ఇలాంటి లేఖలు రాశారని ఆయన పార్టీ సీనియర్స్ పై తీవ్రంగా మండిపడ్డారు.
దీనిపై స్పందించిన గులాంనబీ ఆజాద్ ఈ వ్యాఖ్యలలో నిజం లేదని రాహుల్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేయడానికి కూడా సిద్ధమంటూ ఓ రేంజిలో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
రాహుల్ చేసిన వ్యాఖ్యల పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ నేతలు పార్టీ తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే బీజేపీతో కుమ్మక్కయ్యనట్లు కాదని ఇలా పార్టీ సీనియర్స్ పై ఫైర్ అవ్వడం సరికాదని ఆయన హితవు పలికారు.
తాజాగా ఈ అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
ఒకప్పుడు మమ్మల్ని బీజేపీ బీ జట్టు అని విమర్శించిన మీకు కాంగ్రెస్ ఎంతటి గౌరవం ఇచ్చిందో చూశారుగా మరి అలాంటి పార్టీకి ఇంకెన్నాళ్లు బానిసలుగా ఉంటారంటూ ఒవైసీ, ఆజాద్‌ను ప్రశ్నించారు.
ఎందుకు ముస్లింలు కాంగ్రెస్ లో సమయం వృధా చేసుకుంటారు.ఇంకా ఎంత కాలం ఇలా కాంగ్రెస్ నాయకత్వానికి బానిసలుగా ఉంటారో ఆలోచించుకోండి’ అంటూ ఒవైసీ చురకలు విసిరారు.