అరే ఇదేందిరా భాయ్.. మరి ఇంత తొందరగా ఆల్ అవుట్ అయ్యారు.. మరి 12 పరుగులకే..

తాజాగా టీ20 క్రికెట్ చరిత్రలో మరో రికార్డ్ మంగోలియా క్రికెట్ టీం( Mongolia Cricket Team ) సొంతం చేసుకుంది.కేవలం 12 పరుగులకే ఆ టీం చాప చుట్టేసింది.

 Oh, This Is It Bhai, They Got All Out So Quickly And For 12 Runs, Mongolia, All-TeluguStop.com

ఇది టి20 క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యలతో స్కోరు కావడం విశేషం.కేవలం 8.5 ఓవర్లలోనే మంగోలియా 12 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి జపాన్ టీం 205 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

Telugu Mongolia, Upadtes, Ti-Latest News - Telugu

ఇకపోతే గత సంవత్సరం టీ 20 క్రికెట్( T20 cricket ) చరిత్రలో అత్యంత అత్యల్ప స్కోర్ 10 నమోదైన విషయం తెలిసిందే.2023 ఫిబ్రవరి 26న స్పెయిన్ దేశంతో జరిగిన మ్యాచ్లో ‘ఐసిల్ ఆఫ్ మ్యాన్ ‘( Isle of Man ) జట్టు కేవలం పది పరుగులకే ఆల్ అవుట్ అయ్యి ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.ఆ టీం తర్వాత ఇప్పుడు మంగోలియా రెండో స్థానాన్ని సంపాదించుకుంది.

Telugu Mongolia, Upadtes, Ti-Latest News - Telugu

మంగోలియా దేశంలోని సాన్ లోని క్రికెట్ గ్రౌండ్లో జపాన్ ( Japan )మంగోలియా ఎడ్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది.మొదట బ్యాటింగ్ చేసిన జపాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 217 పరుగుల భారీ స్కోర్ ను చేసింది.ఇందులో భాగంగా జపాన్ బ్యాట్స్మెన్ సౌబరిష్ రవిచంద్రన్ 39 బంతులలో ఆరు ఫోర్లు నాలుగు సిక్సర్ల సహాయంతో 69 పరుగులు చేయగా.

, జపాన్ టీం కెప్టెన్ కెెండెల్ 32 పరుగులతో, ఇబ్రహీం హసి 31 పరుగులతో రాణించడంతో జపాన్ భారీ స్కోరును అందుకుంది.ఇక ఆ తర్వాత భారీ లక్ష్యం చేదనకు బ్యాటింగ్ దిగిన మంగోలియా జట్టుకు ఏమాత్రం కలిసి రాలేదు.

జపాన్ బౌలర్ కజుమా కటే మంగోలియా బ్యాట్స్ మెన్స్ కు చుక్కలు చూపించాడు.కేవలం 3.2 ఓవర్లు వేసిన అతను ఏడు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టాడు.దీంతో కేవలం 8.5 ఓవర్లలోనే మంగోలియా 12 పరుగులకు ఆల్ అవుట్ అయింది.ఇక మంగోలియా ఇన్నింగ్స్ లో మొత్తం ఆరు డక్ ఔట్లు ఉండడం విశేషం.

మంగోలియా జట్టులో సుమియా చేసిన నాలుగు పరుగులే అత్యధిక స్కోర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube