ఆర్ఆర్ఆర్‌లో తారక్ మరో అవతారం.. అందుకేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Ntr Not Attending Any Celebrations, Ntr, Rrr, Tollywood News, Events, Rajamouli-TeluguStop.com

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్థినకు అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టాలని చూస్తోంది.ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో చేస్తాడా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

కాగా తారక్ ఈ మధ్య ఎక్కువగా మీడియాలో, బయట వేడుకల్లో కనిపించడం లేదు.దీనికి ఓ బలమైన కారణం ఉందని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్‌లో తారక్ లుక్ సరికొత్తగా ఉండబోతుందని, అందుకే ఆ లుక్‌ను బయటపెట్టేందుకు తారక్ ఇష్టపడటం లేదట.

ఇక ఈ సినిమాలో తారక్ చేసే పర్ఫార్మెన్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని, ఈ సినిమాలో తారక్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఐరిష్ బ్యూటీ ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube