ఆర్ఆర్ఆర్‌లో తారక్ మరో అవతారం.. అందుకేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్థినకు అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టాలని చూస్తోంది.

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో చేస్తాడా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

కాగా తారక్ ఈ మధ్య ఎక్కువగా మీడియాలో, బయట వేడుకల్లో కనిపించడం లేదు.

దీనికి ఓ బలమైన కారణం ఉందని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్‌లో తారక్ లుక్ సరికొత్తగా ఉండబోతుందని, అందుకే ఆ లుక్‌ను బయటపెట్టేందుకు తారక్ ఇష్టపడటం లేదట.

ఇక ఈ సినిమాలో తారక్ చేసే పర్ఫార్మెన్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని, ఈ సినిమాలో తారక్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఐరిష్ బ్యూటీ ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఓర్కా తిమింగలాన్ని టీజ్ చేసిన న్యూజిలాండ్ వ్యక్తి.. కట్ చేస్తే భారీ షాక్..?