పార్టీ కోసం పని చేసిన వారికే నామినేటెడ్ పదవులు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి వచ్చి నెల రోజులు అయింది.ఈ నెల రోజులలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

 Nominated Posts For Those Who Have Worked For The Party Cm Revanth Reddy Key Ann-TeluguStop.com

సీఎంగా రేవంత్ రెడ్డి… ప్రమాణ స్వీకారం చేశాక చాలావరకు ప్రజలతో ప్రభుత్వాన్ని మమేకమయ్యాల రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ప్రగతి భవన్ నీ ప్రజా భవన్ గా మార్చి ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నియామకాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

అదేవిదంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల( Six guarantees ) హామీలకు ప్రజాపాలన దరఖాస్తు ఇటీవల విడుదల చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ నెల మూడున గాంధీ భవన్ లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పార్టీ కోసం పనిచేసిన వారితోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని వ్యాఖ్యానించారు.నా అనుచరుడనో, బంధువనో.పదవులు ఇచ్చేది లేదు.విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే పనిచేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube