ఆర్టీసీ కార్మికుల సమ్మెను గత బీఆర్ఎస్( brs ) ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) అన్నారు.మన ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు అన్నీ నెరవేరుస్తామన్నారు.
మహాలక్ష్మీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.ఆర్టీసీపై ఎలాంటి భారం తాము మోపలేదని చెప్పారు.
ప్రతి పైసా ఆర్టీసీకి చెల్లిస్తున్నామని తెలిపారు.ప్రస్తుతం వంద బస్సులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించారు.
ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.