టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ కు( Nithya Menon ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ప్రస్తుతం ఇడ్లీ కడై( Idli Kadai Movie ) అనే సినిమాలో నిత్యామీనన్ నటిస్తుండగా ధనుష్( Dhanush ) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తిరు తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.ప్రేమ, పెళ్లి గురించి నిత్యామీనన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రేమ విషయంలో నాకు ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలు లేవని ఆమె తెలిపారు.నాకిప్పుడు ప్రేమ, పెళ్లి ముఖ్యం కాదని ఆమె చెప్పుకొచ్చారు.కెరీర్ విషయంలో తాను సంతోషంగా ఉన్నానని నిత్యామీనన్ పేర్కొన్నారు.ప్రేమ, పెళ్లికి సమయం వస్తుందని ఆ సమయం ఎప్పుడైనా రావచ్చని ఆమె వెల్లడించడం గమనార్హం.నా లైఫ్ లో ప్రేమకు( Love ) అవకాశం లేదని కాదని అలాగని ప్రేమకు వ్యతిరేకం కాదని నిత్యామీనన్ పేర్కొన్నారు.

నా లైఫ్ లో ప్రేమకు అవకాశం లేదని కాదని నా లైఫ్ లోనూ ఎవరైనా రావాల్సిందేనని నిత్యామీనన్ తెలిపారు.కానీ ఇప్పుడే పెళ్లి( Marriage ) చేసుకో అనే మాటలు నేను నమ్మనని నిత్య పేర్కొన్నారు.ప్రేమ, పెళ్లి విషయంలో ఫ్లెక్సిబుల్ గా ఉన్నానని ఆ సందర్భం ఎప్పుడైనా రావచ్చని 50 ఏళ్ల వయస్సులో వచ్చినా సరే నేను సంతోషిస్తానని ఆమె అన్నారు.
జీవితంలో ఒక వ్యక్తిగా చాలా ఎదుగుతున్నా మరింత నేర్చుకుంటూనే ఉంటానని నిత్య తెలిపారు.అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే నా లైఫ్ లోకి వస్తాడని ప్రస్తుతం నేను దాని కోసం వెతకడం లేదని లైఫ్ అనేది చాలా విషయాలతో ముడి పడి ఉందని నిత్యామీనన్ పేర్కొన్నారు.
నిత్యామీనన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.నిత్యామీనన్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.