రైతు రుణమాఫీపై చర్చకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సిద్ధమా - మానకొండూర్ మాజీ ఎంఎల్ఏ రసమయి బాలకిషన్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మానకొండూర్ మాజీ ఎంఎల్ఏ రసమయి బాలకిషన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లి కి రైతుల సమస్యలపైఅవగాహనా లేదు.ఎమ్మెల్యే కు కమీషన్ల మీద ఉన్న సోయి రైతులకు న్యాయం చేయడంలో లేదని,రైతు రుణమాఫీ ఏ ఊర్లో పూర్తిగా జరిగిందో ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా అంటూ చెప్పారు.

 Former Manakondur Mla Rasamayi Balakishan Challenge To Mla Kavvampalli, Farmer-TeluguStop.com

ఎమ్మెల్యే కవ్వంపల్లి హడావిడిగా కొనుగోలు కేంద్రాలను ప్రారాంబిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క లారీ వరి ధాన్యం మిల్లుకు పోలేదు.అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుందని, అకాల వర్షాలతో రైతులు ఆగమౌతున్నారని, రైతులు గంటకు 3500 ఖర్చు చేసి చైన్ హార్వెస్టర్లతో వరి కోపిస్తున్నారని, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రయివేట్ వ్యాపారులు అడ్డికి పావుసేరు ధాన్యం కొంటున్నారు.

ఎమ్మెల్యే కమీషన్ల నారాయణ ప్రారంభం చేసిన ఒక్క కొనుగోలు కేంద్రాల్లో కూడా మిల్లుల అలాట్ మెంట్ కాలేదని,కొనుగోలు కేంద్రాల్లో కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ తరపున తాము నిజాలు చెప్పుతుంటే అబద్దాలు చెప్తున్నారని ఎమ్మెల్యే మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని,రైతులకు ప్రభుత్వంపై నమ్మకం లేక, దిక్కులేక, దళారులకు అమ్ముకుంటున్నారు.

రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసి పండించిన పంటను కొంటామని,రైతులకు కనీసం ప్రభుత్వం భరోసా ఇచ్చే పరిస్థితి లేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ అమలు కాలేదని,ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీకు దమ్ము ఉంటే మిల్లులు అలాట్ మెంట్ చేయించి చూపించండి.అయ్యా కమీషన్ల నారాయణ ఇప్పటి వరకు ఏ గ్రామములో రైతు రుణమాఫీ పూర్తి అయిందో చర్చకు సిద్ధమా? నీ ఊరు అని చెప్పుకొనే పచ్చునూరులోనే చర్చకు సిద్ధమా? ఎన్నికల ముందు ధాన్యానికి 500 భోనస్ ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇప్పుడు సన్న వడ్లకే భోనస్ ఇస్తామని చెప్పడం ఏమాత్రం న్యాయం మీరే చెప్పాలి.తెలంగాణ రైతులు దొడ్డు రకం వడ్లను సాగు చేస్తారు.కానీ సన్నా రకాలు ఎకరాల కొద్దీ సాగు చేయరు.

కొనుగోలు కేంద్రాల్లో గొనె సంచులు లేనప్పుడు, ఎమ్మెల్యే వేసుకునే కండువాలో ధాన్యం జోకమంటారా అని అన్నారు.ఎమ్మెల్యే కు కాంగ్రెస్ లీడర్లతో జోకించుకునుడు తప్ప,ధాన్యం జోకించే దానిపై సోయిలేదు.

ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, సెస్ డైరెక్టర్ రవిందర్ రెడ్డి, కేవీఎన్ రెడ్డి, ఉడుతల వెంకన్న, గోపాల్ రెడ్డి, సంతోష్ రెడ్డి, కుడుముల నాగరాజు, కేషవేని శ్రీనివాస్, దమ్మని మధు, రఘు, బోయిని రమేష్, మధు, రాజు, దేవయ్య, సత్యం, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube