మెగా డాటర్ నిహారిక.యూట్యూబ్ పై ముద్దపప్పు ఆవకాయ అంటూ వచ్చి.బుల్లితెరపై ఢీ అంటూ తలపడి.వెండితెరపై మెరిసిన హీరోయిన్ నిహారిక.మెగా కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు కానీ.హీరోయిన్ గా వచ్చిన ఒకేఒక అమ్మాయ్ నిహారిక.
ఇక అలాంటి ఈ ముద్దుగుమ్మ కూడా ఈ నెల 9వ తేదీన చైతన్య జొన్నలగడ్డను జైపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని మరో ఇంటి అమ్మాయిగా మారిపోయింది.
మొన్న పెళ్లి జరిగిన కొన్ని రోజులు అంతా నిహారిక గురించే మాట్లాడారు అంటే నమ్మండి.
ఆమె పెళ్లి ఓ చిన్న సినిమా బడ్జెట్ తో చేశారు.దాదాపు 4 కోట్ల రూపాయిలు బడ్జెట్ పెట్టి నిహారిక పెళ్లిని అంగరంగవైభవం జరిపారు నాగబాబు.వరుణ్ తేజ్.ఇక ఈ నేపథ్యంలోనే పెళ్లి తంతు అన్ని ముగించుకున్న నిహారిక చైతన్య ఇప్పుడు మాల్దీవ్స్ కు హనీమూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ ట్రిప్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.

ఇక ఈ నేపథ్యంలోనే నిహారిక చైతన్యకు సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అదేంటంటే.నిహారికకు చైతన్య ముద్దు పేరు పెట్టాడట.
ఆ ముద్దు పేరు ఏంటో తెలుసా? అదేనండీ.చేప అంట.ఇద్దరు కలిసి స్నార్కలింగ్ చేస్తున్న సమయంలో చైతన్య జొన్నలగడ్డ ఓ ఫోటో తీశాడు.ఆ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.
ఓ ఆదివారం నా ‘చేప’తో స్నార్కలింగ్ అంటూ కామెంట్ చేశాడు.ఆ కామెంట్ తో.ఓహో.నిహారికకు ఈ ముద్దు పేరు పెట్టావా బాబు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.