తెలంగాణా సంస్కృతీ సాంప్రదాయాలకి అద్దం పట్టే పండుగ బతుకమ్మ.ఈ పండుగని ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణా వాసులు తప్పకుండా చేసుకుని తీరుతారు అనడంలో సందేహం లేదు…తెలంగాణలో ఎంతో ఘనంగా ఏంతో వైభవంగా చేసుకునే బతుకమ్మ సంబరాలు ఖండాంతరాలు దాటి విస్తరించింది.
అయితే న్యూజిలాండ్ లో జరిగిన ఒక సంఘటనతో విశ్వవ్యాప్తం అయ్యింది.అందరూ బతుకమ్మ గురించే ఆరా తీయడం విశేషం ఇంతకీ ఏమి జరిగిందంటే.
న్యూజిలాండ్‌లో బతుకమ్మ సంబురాలు ఎంతో అద్భుతంగా నిర్వహించారు…ఈ నేపధ్యంలో తెలంగాణ ఆడపడుచులతో కలిసి న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కూడా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం విశేషం.ఈ బతుకమ్మ పండుగ సంబరాల నేపధ్యంలో జెసిండా నుదుటన బొట్టు పెట్టుకొని.బతుకమ్మ చుట్టూ తిరిగి గౌరమ్మకు పూజ చేశారు.
అక్కడి తెలంగాణ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు…న్యూజిలాండ్ చరిత్రలో ప్రధాన మంత్రిగా ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా ఆమె రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు .ప్రపంచ చరిత్రలోనే బతుకమ్మ సంబురాల్లో ఓ దేశ ప్రధాని ఆడిపాడటం తెలుగు పండుగలకి ఒక విదేశీ ప్రధాని గౌరవం ఇచ్చినట్టే…
.తాజా వార్తలు