కాంట్రవర్సీ కింగ్ … వివాదాలను వెతుక్కుంటూ వెళ్లే వర్మ మళ్లీ ఫార్మ్ లోకి వచ్చాడు.తాజాగా ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను పెట్టాడు.
నిక్కర్, బనియన్ వేసుకున్న ఆయన అచ్చం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లానే ఉన్నారు.ఏదో హోటల్ లో భోజనాలు వడ్డిస్తున్నారు.‘ఈ వ్యక్తి ఎక్కడున్నారో కనుక్కోవడానికి ఎవరైనా నాకు సహకరించగలరా? ఈయన ఆచూకీ తెలిపిన తొలి వ్యక్తికి లక్ష రూపాయల బహుమతి ఇస్తా’ అంటూ ట్వీట్ చేశారు.
ఎవరికైనా తెలిస్తే [email protected] మెయిల్ ఐడీకి వివరాలు పంపించాలని కోరారు.వర్మ పోస్ట్ చేసిన ఈ ఫొటోలోని వ్యక్తి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా రకరకాలా పోస్టింగ్స్ వ్యంగ్యంగా వస్తున్నాయి.
.
తాజా వార్తలు