స్మార్ట్‌ఫోన్‌తో క‌రోనా ఉందో.. లేదో అర నిమిషంలో తెలుసుకోవ‌చ్చ‌ట‌?

ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే.అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా మాన‌వ మున‌గ‌డ‌కే పెద్ద గండంగా మారింది.ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.51కోట్లు దాటింది.అటు క‌రోనా కాటుకు బ‌లైపోతున్న వారి సంఖ్య 8.4 ల‌క్ష‌లు మించిపోయింది.

 New Voice Analysis App Uses Ai To Detect Signs Of Coronavirus Infection! Voice A-TeluguStop.com

ప్ర‌స్తుతం క‌రోనా వేగంగా విజృంభిస్తున్న వేళ.టెస్టులు చేయించుకోవ‌డం చాలా క‌ష్టంగా మారింది.మీకు తెలియని విష‌యం ఏంటంటే.క‌రోనా టెస్ట్ చేయించుకోవ‌డానికి హాస్ప‌ట‌ల్స్‌, కొవిడ్ కేర్ సెంటర్ల చుట్టూ తిర‌గ‌కుండా స్మార్ట్‌ఫోన్‌తో కూడా చేసుకోవ‌చ్చు.అదెలా సాధ్యం అంటే.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన వాయిస్ ఎనాలసిస్ యాప్‌తో టెస్ట్ చేసుకోవచ్చు.

అందుకు ముందుగా వాయిస్ ఎనాలసిస్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.అనంత‌రం ఈ యాప్ ఓపెన్ చేసి టెస్ట్ చేసుకోవాలనుకునే వ్యక్తి… తన వాయిస్‌ని రికార్డ్ చెస్తే.

అప్పుడు ప్రపంచంలో కరోనా పాజిటివ్, నెగెటివ్ వచ్చిన కోట్ల మంది వాయిస్‌లతో మీ వాయిస్‌ను ఎనాలిసిన్ చేసి క‌రోనా ఉండో.లేదో చెబుతుంది.రిజ‌ల్ట్‌ను కేవ‌లం అరినిమిషంలోనే ఇచ్చేస్తుంది.

ఈ వాయిస్ ఎనాలసిస్ యాప్ ద్వారా చేసుకున్న క‌రోనా టెస్ట్‌లో నెగ‌టివ్ వ‌స్తే ప‌ర్వాలేదు.

కానీ, పాజిటివ్ వ‌స్తే మాత్రం శాలివా టెస్ట్ వంటి ఇత‌ర టెస్ట్‌ల‌ను చేయించుకోవాల్సి ఉంటుంది.అయితే ఈ యాప్ ద్వారా దాదాపు 80 శాతం క‌చ్చితమైన ఫలితాల్ని ఇచ్చింద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం ఈ యాప్‌ను మ‌రింత డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube