తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత మూడు దశాబ్దాలుగా యాంకర్ గా కొనసాగుతూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యాంకర్ సుమ ( Anchor Suma ) ఒకరు.ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
వైపు సినిమా ఈవెంట్లను నిర్వహిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇలా యాంకర్ గా తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సుమ కొన్ని సినిమాలలో కూడా నటించారు.
ఈమె ప్రధాన పాత్రలో తాజాగా జయమ్మ పంచాయతీ( Jayamma Panchayathi ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో సుమ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.అయితే ప్రస్తుతం ఈమె యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే యూట్యూబ్ ఛానల్( Suma YouTube Channel ) ప్రారంభించినటువంటి సుమ ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా ఎన్నో రకాల వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.
ఈమె ఎక్కువగా తన ఇంట్లో పని మనుషులతో పాటు తన టీం తో కలిసి చేసే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.ఈ వీడియోలకు ఎంతో మంచి ఆదరణ కూడా లభిస్తుందనే విషయం మనకు తెలిసిందే.
అయితే తాజాగా సుమ ఒక వీడియోని సోషల్ మీడియా( Social Media ) వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇది కాస్త వైరల్ గా మారింది.ఈమె ల్యాప్ టాప్ కి ఫేస్ లాక్( Laptop Face Lock ) పెట్టారు అయితే మేకప్ లేకుండా లాప్టాప్ ఓపెన్ చేయాలి అని చూడగా లాప్టాప్ అసలు ఓపెన్ కాదు.దీంతో సుమ ఓరి దీని దుంప తెగ అసలు నన్ను గుర్తుపట్టలేక పోతుంది అంటూ వెంటనే ఫుల్లుగా మేకప్ వేసుకోనీ మరోసారి లాక్ ఓపెన్ చేయగా లాప్టాప్ ఓపెన్ అవుతుంది.ఈ వీడియోని ఈమె ఫేస్ ఐడి వర్సెస్ మీ( Face id vs Me ) అంటూ ఈ వీడియోని షేర్ చేశారు.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఈ వీడియో పై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.మీ వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయి సుమక్క( Sumaakka ) అంటూ కామెంట్స్ చేయక మరికొందరికి ఈ వీడియో పట్ల విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.ఇక ఒక నెటిజన్ అయితే ఈ వీడియో పై చాలా క్రేజీ కామెంట్ చేశారు .మేకప్ లేకపోతే మీరు సుమా అని మేమే గుర్తుపట్టలేము.ఇక లాప్టాప్ ఎలా గుర్తు పడుతుంది అంటూ ఈమె పట్ల నేటిజన్ చేసినటువంటి ఈ కామెంట్( Funny Comments ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఏది ఏమైనా సుమ ఎక్కడున్న తన కామెడీ, డైలాగులతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారని చెప్పాలి.