ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో ఎలాంటి విషయమైనా ఇట్టే వైరల్ అయిపోతుంది.అయితే తాజాగా ఓ యువకుడు తన మేనత్త మరియు మేనకోడలిపై వీరంగం ప్రదర్శిస్తూ చితక బాదిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
అయితే ఆ వీడియోని ఒకసారి పరిశీలించినట్లయితే ఓ వివాహిత తన కూతురిని వెంటబెట్టుకొని వచ్చి షాపు ముందు గొడవ చేస్తోంది.అయితే ఇందులో మహిళ తన మేనల్లుడు తన కూతురికి అసభ్యకరంగా మెసేజ్ చేశాడని చెబుతూ పట్టరాని ఆవేశంతో ఊగి పోయింది అంతేకాకుండా పక్కనే ఉన్న కర్ర అందుకుని గబా గబా నాలుగు దెబ్బలు వేసింది.
దీంతో యువకుడు ఏకంగా అత్తాకూతుళ్లను కలిపి తనని కొట్టిన కర్రతోనే దెబ్బలు వాయించాడు.అయితే ఇదంతా గమనిస్తున్న స్థానికులు చోద్యం చూస్తున్నారు తప్ప కనీసం ఒక్కరు కూడా యువకుడిని ఆపేందుకు ముందుకు రాలేదు.
దీనికితోడు కొందరైతే ఈ ఘటన ని ఏకంగా తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.
దీంతో కొందరు నెటిజన్లు ఈ వీడియోపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా తప్పు చేసావని అడిగిన మహిళ మరియు ఆమె కూతురుని చితకబాదిన యువకుడిని ఆపాల్సిందిపోయి చోద్యం చూస్తూ వీడియో తీస్తున్నారా.? అంటూ సంఘ్తన జరిగిన ప్రదేశంలో ఉన్న జనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే ప్రస్తుతం జనరేషన్ లో గొడవలు జరుగుతున్నా లేదంటే ఇతరులు అపాయంలో ఉన్నా సహాయం అందించాల్సిందిపోయి వీడియోలు తీయడం అందరికీ అలవాటు అయిందని ఇలాంటి దిక్కు మాలిన సమాజంలో బ్రతుకుతున్నామని కామెంట్లు చేస్తున్నారు.