దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) పాలనపై డాక్యుమెంట్ విడుదల అయింది.ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్( Congress Digvijay Singh ) డాక్యుమెంట్ ను రిలీజ్ చేశారు.
మోదీ పాలనలో పేదవాళ్లు మరింత పేదవారిగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారారని పేర్కొన్నారు.మోదీ ప్రభుత్వం కార్పొరేట్ లకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు.
అదానీ వంటి కుబేరులకు మాత్రమే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు.అలాగే దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో డిమాండ్ల సాధన కోసం రైతులు( Farmers Protest ) ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.అదేవిధంగా దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.