వైకాపా నుండి మెగా బ్రదర్ కు పాలకొల్లు కన్ ఫార్మ్?

ఒకప్పుడు అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో సంస్ధాగత వ్యవహారాలపై, మద్దతు సమీకరణపై పెద్ద ఎత్తున కసరత్తు చేసిన నాగబాబు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత రాజకీయాల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే .అయితే ఇప్పుడు తాజాగా నాగబాబు.

 Nagababu To Joins Ysrcp Congress-TeluguStop.com

జగన్‌కు జై కొట్టబోతున్నట్టు సమాచారం .వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని టాక్.నాగబాబు సొంత ప్రాంతం పాలకొల్లు నుంచి పోటీ చేయాలనీ ఉన్నాడని ఈ మేరకు వైకాపా నుండి హామీ కూడా వచ్చిందని చెబుతున్నారు

మొదట కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుదాం అనుకున్న నాగబాబు ఇప్పుడు సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకుపోతుందనే ఉద్దేశం తో వైకాపా వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.పాలకొల్లు నుంచి గెలవడం ద్వారా తమ కుటుంబానికి ఉన్న స్థానిక బలాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో నాగబాబు ఉన్నట్లు ఓ టీవీ చానెల్‌లో కథనాన్ని ప్రసారం చేసింది!

తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి ఆమ్ ఆద్మీ పార్టీ లో చేరుతున్నట్టు దుమారం ఒకవైపు చెలరేగుతుండగా.

మరోవైపు నాగబాబు విషయంపై టాలీవుడ్‌లో ఊహాగానాలు జోరందుకున్నాయి.ఓ ప్రఖ్యాత టీవీ చానెల్‌లో నాగబాబు జగన్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు మొదలయ్యాయి .నాగబాబుకు పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం టికెట్ ఇవ్వడానికి వైయస్ జగన్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube