సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ హైబ్రిడ్ పిల్లగా ఒక గుర్తింపు తెచ్చుకుంది.
న్యాచురల్ అందాలతో తెలుగు ప్రేక్షకులను తన వైపుకు మలుపుకుంది.మొదట్లో డాన్స్ లు చేస్తూ అందరి దృష్టిలో పడిన సాయి పల్లవి( Sai Pallavi ) ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషలో కూడా నటించి మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

తక్కువ సమయంలో స్టార్ క్రేజ్( Star Craze ) సొంతం చేసుకుంది.ఇక ఈమె ఎంచుకునే సినిమాలు, పాత్రలు కూడా హోమ్లీ గా ఉంటాయి.చాలావరకు డబ్బుకు ఆశపడకుండా పాత్రకు ఇంపార్టెంట్ ఇస్తుంది సాయి పల్లవి.
గ్లామర్ షో చేయడానికి కూడా అంతగా ఇష్టపడదు.తనకు కంటెంట్ నచ్చకపోతే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా వదిలేసుకుంటుంది.
అందుకే ఆలస్యమైన సరే మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది సాయి పల్లవి.ఇక ఈమె తోటి హీరోయిన్ లంతా అందాలను ఆరబోస్తున్నప్పటికీ కూడా ఈమె మాత్రం అలాగే ఉంటుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే సాయి పల్లవి గురించి ప్రస్తుతం ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే తనకు గతంలో పెళ్లి( Sai Pallavi Marriage ) జరిగిందని ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.

అయితే ఇది రియల్ లైఫ్ లో జరిగింది కాదు.రీల్ లైఫ్ లో జరిగింది.అసలు విషయం ఏంటంటే.2018 లో ఏ ఎల్ విజయ్ తెరకెక్కించిన తమిళ, తెలుగులో ద్విభాష గా ‘ కణం'( Kanam ) మూవీ తెరకెక్కింది.ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది సాయి పల్లవి.అయితే ఈ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.అయితే ఈ సినిమాలో వీరిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకోగా పెళ్లి చేసుకున్నప్పటి వీడియో ఇప్పుడు బాగా వైరల్ గా మారింది .

అందులో పెళ్లి మండపంలో సాయి పల్లవి, నాగశౌర్య( Naga Shaurya ) చాలా చక్కగా కనిపించారు.ఇక పెళ్లి తర్వాత ఇంటికి వచ్చి తన భార్య ఒంటరిగా దొరికితే ముద్దులు పెట్టుకుందాం అనే కోరికతో నాగశౌర్య ఆమె వెనకనే తిరగడం.ఫైనల్లీ వన్ మూమెంట్ చూసి రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసేయడం అయితే ఇది చూసి అక్కడే ఉన్న ముసలి భామల గుంపు ముసి ముసి నవ్వులు నవ్వుకునే సన్నివేశాలు చాలా చాలా హైలెట్ అయ్యాయి.
ఇక ఆ వీడియో చూసి సాయి పల్లవి అభిమానులు ఫిదా అవుతున్నారు.నిజంగా సాయి పల్లవి పెళ్లిచూసినట్లు అనిపిస్తుందని.రియల్ లైఫ్ లో ఇలా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అని తెగ ఎదురుచూస్తున్నాం అని అంటున్నారు.మరీ సాయి పల్లవి తన అభిమానుల కోసం పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి.
ప్రస్తుతం ఒక మూవీ లో మాత్రం బిజీ గా ఉందని తెలుస్తుంది.