సింగర్ సునీత (Singer Sunitha) పరిచయం అవసరం లేని పేరు సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను సింగర్ గాను ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సునీత ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఒకవైపు సినిమాలలో పాటలు పాడుతూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన రీల్స్ ద్వారా అందరిని సందడి చేస్తున్నారు.ఇలా సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో స్థిరపడిన సునీత కుమారుడు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.
సునీత కుమారుడు ఆకాష్ (Akash)కే రాఘవేంద్రరావు (K.Raghavendra Rao) నిర్మాణంలో సర్కారు నౌకరి (Sarkaru Noukari) సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా పలువురు నిర్మాతలు పాల్గొని సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సునీత కూడా పాల్గొని వేదికపై తన కుమారుడు గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ రాఘవేంద్రరావు గారి సినిమాలకు ఎన్నో పాటలు పాడాను ఈ సంస్థలో ఎన్నో డబ్బింగ్ చెప్పాము ఈ సమస్త మాకు ఒక హోమ్ బ్యానర్ లాంటిదని తెలిపారు.

ఇక ఇప్పటికి తాను ఎన్నో పురస్కారాలు నంది అవార్డులు అందుకున్న ఎప్పుడు కూడా తాను ఎమోషనల్ కాలేదని ఈమె తెలియజేశారు.ఇవాళ ఈ స్టేజ్ మీద మాట్లాడుతుంటే తాను చాలా ఉద్వేగానికి గురవుతున్నానని తెలిపారు.రాఘవేంద్ర రావు గారు నాతో మాట్లాడుతూ.
మీ అబ్బాయి మంచి నటుడే కాదు మంచి సంస్కారం నడవడిక ఉన్న వ్యక్తి కూడా అంటూ నాకు చెప్పడంతో నా జీవితంలో ఇంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ మరేది లేదనిపించింది అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.పిల్లలు ఎదిగితే వచ్చే సంతోషం ఇదే కావచ్చు అంటూ ఈ సందర్భంగా సునీత చేసినటువంటి ఈ ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.