తెలంగాణలో సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కొంతకాలంగా టిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.బిజెపికి రాజీనామా చేసిన ఆయన టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం నరసింహుల కు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.దీంతో ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరింతగా ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు.
అలాగే కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం పైన మోత్కుపల్లి నరసింహులు ప్రశంసలు కురిపించడం, తదితర కారణాలతో ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్నారు అని, ఆయనకు దళిత బంధు పథకం చైర్మన్ గా బాధ్యతలు అప్పగించ బోతున్నారు అనే ప్రచారం చాలా కాలం నుంచి వస్తోంది.అసలు ఆ హామీతోనే మోత్కుపల్లి టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు గా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఆయన ఈనెల 18వ తేదీన టిఆర్ఎస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.స్వయంగా కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ కనువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ భవన్ లో l జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున అనుచరులతో ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.హుజురాబాద్ ఉప ఎన్నికలలో దళిత సామాజిక వర్గం ఓట్లు కీలకం కావడం, గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో వారు ఉండటం, తదితర కారణాలతో మోత్కుపల్లికి టిఆర్ఎస్ లో ప్రాధాన్యం పెరిగింది.

ఇక ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పని చేశారు.సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ లో ఆయన కీలకంగా ఉన్నారు.1983 లో తొలిసారిగా ఆయన ఆలేరు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.ఆ తరువాత టిడిపిలో ఆయన చేరారు.
అప్పటి నుంచి ఆయన టిడిపిలో కొనసాగుతూనే వచ్చినా, 2018 మే 28 న టీడీపీ నుంచి మోత్కుపల్లి నర్సింహులును బహిష్కరించారు.దీంతో ఆయన నవంబర్ 4వ తేదీ 2019లో బిజెపిలో చేరారు.
జూలై 23 2021లో ఆయన బిజెపికి రాజీనామా చేశారు.