విశాఖ: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పంచ గ్రామాల భూ సమస్యలపై వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు.నాలుగు దశలుగా పంచ గ్రామాల్లో భూ సమస్యను పరిష్కరిస్తానని వెల్లడి.
ఈరోజు ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అదీప్ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఐదు గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చూసి గత ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్దేశంతోనే పంచ గ్రామాల సమస్య పై ఈ నెల 25న సమావేశమయ్యారని తెలిపారు.
వంద గజాల లోపున వారికి ఉచితంగా, వంద గజాల నుంచి 300 గజాల లోపు ఉన్న వారికి 1998వ సంవత్సరం ప్రకారం 70 శాతం చెల్లించాలి, 300 గజాలు పైన ఉన్న వారికి 1998 సంవత్సరం ప్రకారం పూర్తిగా చెల్లించాలని తెలిపారు.
కమర్షియల్ యూనిట్ వారికి పూర్తిగా మార్కెట్ వేల్యూ కట్టాలని కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.త్వరలో ని ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే అదీప్ ఆన్నారు.
వచ్చే సంక్రాంతి కల్లా పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని ధీమా వ్యక్తం చేశారు.