గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని ధూల్ పేటలో గల చంద్రకిరణ్ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను స్థానిక MLA రాజాసింగ్, ఇంచార్జ్ ప్రేమ్సింగ్ రాథోడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నంద కిషోర్ వ్యాస్ బిలాల్, మాజీ టీఆర్ఎస్ కార్పొరేటర్స్ ముఖేష్ సింగ్, పరమేశ్వరి సింగ్ లతో కలిసి ప్రారంభిస్తారు.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ప్రజల సౌకర్యార్థం బస్తీ దవాఖానా ల ఏర్పాట్లు చేస్తున్నాము.
ప్రజల వద్దకు వైద్య సేవలు తీసుకెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దవాఖానాల ఏర్పాట్లు చేస్తున్నాము.
GHMC పరిధిలో 150 డివిజన్లలో ఇప్పటికే 226 బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి.
డివిజన్ కు 2 బస్తి దవాఖానాలు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈరోజు 32 బస్తి దవాఖానాలు ఏర్పాటు చేశాము.ఈరోజు నూతనంగా 32 బస్తీ దవాఖానాలను ప్రారంభించడం జరిగింది.
ఉచితంగా వైద్య సేవలు, మందులు అందిస్తున్న బస్తీ దవాఖానాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.