ఏపీ లో కరోనా తీవ్ర రూపం దాల్చుతున్న విషయం విదితమే.ఏపీ లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ లో వరుసగా నేతలు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కి కూడా కరోనా పాజిటివ్ నమోదు అయినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా ఆయన తో పాటు తూర్పు గోదావరి జిల్లా, తుని శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా కూడా కరోనా బారినపడినట్లు తెలుస్తుంది.
ఇటీవల ఆర్కే, తండ్రి దశరధరామిరెడ్డి కన్నుమూయడం తో ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు ఆర్కే.ఈ సమయంలోనే ఆయనకు ఎవరి ద్వారానో కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తనకు కరోనా సోకడంతో రెండు వారాల పాటు హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లనున్నామని ప్రకటించిన ఆర్కే, ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని, పరీక్షలు చేయించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.
ఇదే సమయంలో దాడిశెట్టి రాజా కూడా కరోనా నిర్ధారణ కావడం తో వైద్యుల ద్వారా చికిత్సను పొందేందుకు తాను విశాఖపట్నంలోని హాస్పిటల్ కు వెళ్లనున్నానని వెల్లడించారు.
మొత్తానికి వైసీపీ పార్టీ లో వరుసగా మంత్రులు,ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కూడా కరోనా బారిన పడుతూ ఉన్నారు.ప్రజా ప్రతినిధులు వరుసగా కరోనా బారిన పడుతుండడం తో మా పరిస్థితి ఏంటా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.