‘వి’లో నానిని చూసి నోరెళ్లబెట్టడం ఖాయమట!

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా, లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.ఇక ఈ సినిమాతో మరోసారి నాని తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

 Audience Will Be Shocked With Nani Transformation In V Movie, Nani, V Movie, Sud-TeluguStop.com

అయితే ఈ సినిమాలో నాని నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో మరో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాను పూర్తి థ్రిల్లర్ మూవీగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాలో నాని పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఈ సినిమాలో నాని ట్రాన్స్‌ఫార్మేషన్ ఉంటుందని, అది చూసి ప్రేక్షకులు నోరెళ్లబెట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా ఈ సినిమాలో నాని, సుధీర్ బాబుల మధ్య నడిచే మైండ్ గేమ్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, అదితి రావు హైదరీలు నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో నాని వరుసగా మర్డర్‌లు చేస్తూ ఉంటాడని, అతడిని పట్టుకునే పాత్రలో పోలీస్‌గా సుధీర్ బాబు కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 5న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించగా, ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఏదేమైనా ఓటీటీలో నాని సినిమా రిలీజ్ అవుతుండటంతో ఇతర హీరోలు కూడా తమ సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube