జాతీయ జెండాపై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..

నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా జాతీయ జెండా విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.జాతీయ జెండాను మీ ఇంట్లోనే ఉంచుకోండి అంటూ ఫరూఖ్ చేసిన వ్యాఖ్యలు త్రివర్ణ పతాకాన్ని అవమానించేలా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు.

 Controversial Comments Of Former Cm On National Flag ,  Cm, Har Ghar In Jammu An-TeluguStop.com

ఫరూఖ్ వ్యాఖ్యలు దేశ భక్తుల్ని కించపరిచేలా, అహంకారపూరితంగా ఉన్నాయంటున్నారు.

దేశం స్వాతంత్ర్యం సాధించుకొని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదిపాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

అందుకోసం దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ లో అక్కడి పాలనా యంత్రాంగం ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రచారం నిర్వహిస్తోంది.ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా మూడు రంగుల జెండాను ఎగురవేయాలన్న ఆ ప్రచారంపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఫరూఖ్ ఇచ్చిన సమాధానం వివాదాస్పదమైంది.

ఫరూఖ్ వ్యాఖ్యలు జాతీయ జెండాను అవమానించేలా ఉండటం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఇదే అంశంపై ఫరూఖ్ కొన్ని రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపైనా దుమారం రేగింది.

జమ్మూకాశ్మీర్ లో హర్ ఘర్ తిరంగా అమలు కోసం గ్రామీణాభివృద్ధిశాఖ నోడల్ అధికారులను నియమించింది.దానిపై ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ భక్తులకు కోపం తెప్పించేలా ఉన్నాయి.

ఎవరికివారు స్వచ్ఛందగా ఆ పని చేయాలి.ప్రభుత్వ ఆదేశాల వల్ల కాదంటూ ఆయన కామెంట్ చేశారు.

Telugu Controversialcm, Farooq, Flag India, Harghar-Political

మూడు రంగుల జెండాను ఎలా ఎగురవేయాలి అనే అంశం పలుమార్లు ఉన్నత న్యాయస్థానాల్లోనూ విచారణకొచ్చింది.దాంతో,2002 లో కేంద్ర హోంశాఖ దీనిపై స్పష్టత వచ్చింది.ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా పేరుతో జాతీయ జెండాను ఎలా ఎగురవేయాలి అనే దానిపై స్పష్టమైన నిబంధనలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది.రాజ్యాంగంలో పేర్కొన్న నిబంధనలు పాటిస్తూ దేశ పౌరులు ఎవరైనా సరే తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయడానికి అనుమతిచ్చింది.

అయితే, జాతీయ జెండాను వ్యాపార ప్రయోజనాలకు వినియోగించుకోవద్దని షరతు విధించింది.ఇదే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది.2004లో అప్పటి చీఫ్ జస్టిస్ వి ఎన్ ఖరే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల ప్రకారం.ఏడాది పొడవునా ఎవరైనా తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసుకోవచ్చునన్నది గమనార్హం.

ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే ఇలాంటి అంశాలపై కామెంట్ చేసే ముందు ఫరూఖ్ అబ్డుల్లానే కాదు.ఎవరైనా నోరు అదుపులో ఉంచుకోవాల్సిందేనని పలుమార్లు స్పష్టమైంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube