పైనాపిల్.దీనినే అనాస పండు అని కూడా అంటారు.
ఈ సీజన్‌లో విరివిరిగా దొరికే పైనాపిల్స్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు.ఇక కొందరు పైనాపిల్‌తో స్వీట్స్ కూడా తయారు చేసుకుని తింటుంటారు.
అయితే కాస్త పుల్లగా కాస్త తియ్యగా ఉండే పైనాపిల్ తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
జలుబు, గొంతునొప్పి, శ్వాస సమస్యలను తగ్గించడంలో పైనాపిల్ గ్రేట్‌గా సహాయపడుతుంది.ఈ సమస్యలు ఉన్నవారు పైనాపిల్ రసాన్ని తీసుకుని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది.
విటమిన్ సి పుష్కలంగా దొరికే పండ్లలో పైనాపిల్ కూడా ఒకటి.అందుకే రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి అనుకునే వారు ప్రతి రోజు పైనాపిల్‌ను డైట్‌లో చేర్చుకుంటే ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్న పైనాపిల్ తినడం వల్ల రకరకాల ఇన్‌ఫెక్షన్స్ నుంచి రక్షణ లభిస్తుంది.అలాగే చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు.
అలాంటి వారు ప్రతిరోజు పైనాపిల్ తీసుకుంటే.అందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారించడంతో పాటు జీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తుంది.
అలాగే పైనాపిల్ తినడం వల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడటంతో పాటు.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇక నీరసంగా ఉన్నవారు, రక్తహీనత సమస్యతో బాధపడేవారు పైనాపిల్ జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది.అదేవిధంగా, ఒత్తిడి, డిప్రెషన్, మతిమరుపు వంటి సమస్యలను కూడా నివారించగల శక్తి పైనాపిల్‌కు ఉంది.
కాబట్టి, పైనాపిల్‌ను ఖచ్చితంగా మీ డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.అయితే ప్రెగ్నెన్సీ మహిళలు మాత్రం పైనాపిల్‌కు దూరంగా ఉండటం మంచిది.