ఢిల్లీ, ముంబై వంటి లోకల్ ట్రైన్స్‌లో( Local Trains ) ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు.విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులతో ఈ ప్రయాణం విభిన్న అనుభూతులను కలిగిస్తుంది.
కొన్నిసార్లు ఈ ట్రైన్లలో గొడవలు అవుతుంటాయి మరికొన్నిసార్లు ప్రయాణికులు ఒకరికొకరు కలుసుకుని జర్నీని ఫన్ గా మార్చేస్తుంటారు.అయితే తాజాగా ముంబై లోకల్ ట్రైన్ లో( Mumbai Local Trains ) ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది.
అదేంటంటే ఒక ప్రయాణికుడు లతా మంగేష్కర్ పాడిన సూపర్ హిట్ సాంగ్ కాంతా లగా సాంగ్‌ను( Kaanta Laga song ) పాడాడు.
అతను అద్భుతంగా పాట పాడుతుంటే ఆ కోచ్ లోనే ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులు అందరూ ఎంకరేజ్ చేశారు.కొందరైతే డ్యాన్స్ ( Dance ) చేయడం ప్రారంభించి ఆ జర్నీని మరింత ఉత్సాహంగా మార్చారు.ఒక అంకుల్ గ్రేస్ ఫుల్ స్టెప్స్ వేస్తుంటే తోటి ప్రయాణికులు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు.
అప్పటిదాకా ఈ ప్రయాణం అలసటగా అనిపించినా.ఆ తర్వాత ప్రయాణికులకు ఒక ఎనర్జీ బూస్టర్ గా వర్క్ అయ్యింది.
అయితే ఈ అరుదైన అనుభూతిని గుర్తుంచుకునేలా కొందరు తమ ఫోన్లలో ఆటపాటకు సంబంధించి వీడియో రికార్డ్ చేశారు.కాగా ప్రముఖ వీడియో కంటెంట్ క్రియేటర్ కల్పేష్ రాణే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది విస్తృతంగా వైరల్ అవుతుంది.షేర్ చేసిన సమయం నుంచి ఇది 1.7 కోట్లకు పైగా వ్యూస్ సంపాదించింది.ఇది చూసిన నెటిజన్లు “వావ్, వాటే పీపుల్.ప్రతి ప్రయాణమూ ఇలాగే జోష్ ఫుల్‌గా సాగాలి” అని కామెంట్లు చేస్తున్నారు.దీనిని మీరు కూడా చూసేయండి.