దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ ( Krishna ) గారు అనారోగ్య సమస్యల కారణంగా గత ఏడాది నవంబర్ 15వ తేదీ మరణించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈయన మరణించి దాదాపు సంవత్సరం వస్తున్న ఇప్పటికి ఈయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక కృష్ణ గారు మరణించడంతో అభిమానులు పలు ప్రాంతాలలో కృష్ణ గారి విగ్రహాలను ఆవిష్కరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.గత కొద్ది రోజుల క్రితం కృష్ణ కుటుంబ సభ్యుల సమక్షంలో బుర్రపాలెంలో కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం మనకు తెలిసిందే.
అయితే తాజాగా విజయవాడ(Vijayawada) లో కూడా కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
![Telugu Avinash, Kamal Hassan, Krishna Statue, Mahesh Babu-Movie Telugu Avinash, Kamal Hassan, Krishna Statue, Mahesh Babu-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/Mahesh-babu-special-thanks-to-kamal-hassan-and-devineni-Avinash-for-inauguration-of-Krishna-statuec.jpg)
విజయవాడలోని గురునానక్ కాలనీలో కృష్ణ గారి విగ్రహాన్ని లెజెండరీ నటుడు కమల్ హాసన్( Kamal Hassan ) చేతుల మీదగా ఆవిష్కరించారు.ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులలో భాగంగా కమల్ హాసన్ విజయవాడలో ఉన్న నేపథ్యంలోనే ఆయనని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరగా ఆయన అందుకు అంగీకరించి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని వైసీపీ లీడర్స్ దేవినేని అవినాష్ ( Devineni Avinash ) దగ్గరుండి ఆయన సమక్షంలో జరిపించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![Telugu Avinash, Kamal Hassan, Krishna Statue, Mahesh Babu-Movie Telugu Avinash, Kamal Hassan, Krishna Statue, Mahesh Babu-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/Mahesh-babu-special-thanks-to-kamal-hassan-and-devineni-Avinash-for-inauguration-of-Krishna-statued.jpg)
ఇలా విజయవాడలో కమల్ హాసన్ చేతులు మీదుగా కృష్ణ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో మహేష్ బాబు ( Mahesh Babu ) ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది ఈ సందర్భంగా మహేష్ బాబు స్పందిస్తూ నాన్నగారు విగ్రహాన్ని ఆవిష్కరింపచేసినటువంటి కమల్ హాసన్ గారికి దేవినేని అవినాష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.అన్న మమ్మల్ని వదిలి వెళ్లినప్పటికీ ఒక అభిమాన కుటుంబాన్ని మాకు సొంతం చేసి వెళ్లారు.ఫ్యాన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.