ఈ ఐపీఎల్ సీజన్ లోనే భారీ స్కోరు చేసిన లక్నో.. చిత్తుగా ఓడిన పంజాబ్..!

ఈ ఐపీఎల్ సీజన్లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇస్తోంది.ఐపీఎల్( IPL ) వేదికగా కొత్త కొత్త స్టార్లు తమ సత్తా ఏంటో చూపిస్తూ అద్భుత ఆటను ప్రదర్శిస్తున్నారు.

 Lucknow Who Scored A Huge Score In This Ipl Season Punjab Was Badly Defeated , I-TeluguStop.com

కాబట్టి మ్యాచ్లు చివరి బంతి వరకు సాగుతూ, సస్పెన్స్ థ్రిల్లర్ గా మారాయి.తాజాగా లక్నో- పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ అందించింది.

బ్యాటర్లు బౌండరీలు బాదుతూ, బౌలర్లు వికెట్లు పడగొడుతూ తమ సత్తా చూపిస్తూ ఉండడంతో మ్యాచ్లు అన్నీ ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి.లక్నో జట్టు( Lucknow team ) బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు.

ఈ ఐపీఎల్ సీజన్లోనే అత్యధిక స్కోరు చేసిన జట్టుగా లక్నో అగ్రస్థానంలో నిలిచింది.ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

లక్నో బ్యాటర్లైన మర్కస్ స్టోయినిస్( Marcus Stoinis ) 40 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు.కైల్ మేయర్స్ 24 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 54 పరుగులు చేశాడు.నికోలస్ పూరన్ 18 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ తో 45 పరుగులు చేశాడు.

ఆయుష్ బదోని 24 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు.ఈ బ్యాటర్లు చెలరేగడంతో భారీ స్కోర్ నమోదయింది.258 పరుగుల లక్ష్య చేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టులో అథర్వ 36 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 పరుగులు చేశాడు.సికిందర్ రాజా( Sikander Raja ) 22 బంతుల్లో 36 పరుగులు, లివింగ్ స్టోన్ 14 బంతుల్లో 23 పరుగులు, శామ్ కరన్( Sam Karan ) 11 బంతుల్లో 21 పరుగులు చేసిన ఫలితం లేకుండా పోయింది.

లక్నో జట్టు బౌలర్ల ధాటికి తట్టుకోలేక పంజాబ్ జట్టు చేతులెత్తేసి 56 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.ఐపీఎల్ చరిత్రలో పూనే వారియర్స్ పై 263 పరుగులు చేసిన బెంగుళూరు జట్టు ఐపీఎల్లో టాప్ స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది.

ఇక తాజాగా లక్నో జట్టు 257 పరుగులు చేసి రెండవ స్థానంలో నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube