వృద్ధాప్యంలో( Old Age ) ముఖ్యంగా రిటైర్మెంట్ అయ్యాక చాలా మందికి ఆర్థిక సమస్యలు వస్తుంటాయి.ఈ క్రమంలో వారికి నెలవారీ పెన్షన్ మొత్తం అందితే కొంచెం పరిస్థితి బాగుంటుంది.
దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ( LIC ) అన్ని వయసుల వారి కోసం చక్కటి ప్లాన్స్ కలిగి ఉంది.ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రిటైర్‌మెంట్ ప్లాన్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి.
ఇవి వృద్ధాప్యంలో పెన్షన్ టెన్షన్‌ను అంతం చేయబోతున్నాయి.అటువంటి పథకం ‘ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి’ ప్లాన్, ఇది పదవీ విరమణ తర్వాత డబ్బు కొరతను ఎదుర్కోనివ్వదు.
ఈ పథకంలో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెడితే సరిపోతుంది.ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పథకం( LIC New Jeevan Shanti ) అనేది యాన్యుటీ పథకం.
ఒక్కసారి మీరు పెట్టుబడి పెడితే సరిపోతుంది.తర్వాత మీరు ప్రతి నెలా మీరు పెట్టిన మొత్తానికి పెన్షన్ పొందొచ్చు.
ఇందులో పెట్టుబడి పెట్టిన తర్వాత, ఒకటి నుండి ఐదేళ్ల వరకు లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది.ఆ తర్వాత మీరు ప్రతి నెలా స్థిరంగా పెన్షన్ పొందొచ్చు.

ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు.అయితే ఈ ప్లాన్ తీసుకోవడానికి కనీస పెట్టుబడి రూ.1.5 లక్షలుగా నిర్ణయించబడింది.వయోపరిమితి 30 సంవత్సరాల నుండి 79 సంవత్సరాలు.ఈ వయస్సులో ఉన్న ఎవరైనా ఈ ప్లాన్‌ని కొనుగోలు చేయవచ్చు.ఈ పెన్షన్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు.ఇది కాకుండా, మీరు వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ తర్వాత కోరుకున్న వ్యవధిలో పెన్షన్‌ను స్వీకరించే ఎంపికను కూడా ఎంచుకోవచ్చు.

అంటే ప్రతి నెలా పెన్షన్ తీసుకోవచ్చు, కావాలంటే మూడు నెలలు లేదా ఆరు నెలలు ఎంచుకోవచ్చు లేదా ఏటా ఒకేసారి పెన్షన్ కూడా పొందవచ్చు.ఈ సింగిల్ ప్రీమియం ప్లాన్( Single Premier Plans ) కింద, మీరు కనీసం రూ.1.5 లక్షల పెట్టుబడి పెడితే, మీకు నెలకు పెన్షన్ రూ.1,000గా నిర్ణయించబడుతుంది.మీరు ఒకేసారి పెట్టుబడిని 10 లక్షలకు పెంచుకుంటే, మీ నెలవారీ పెన్షన్ రూ.11,192గా అందుతుంది.ఇది మీకు జీవితాంతం అందుతుంది.