జూనియర్ ఎన్టీఆర్ వార్2 మూవీకి యానిమల్ మూవీకి లింక్ ఇదే.. ఆ బ్యూటీ నటిస్తున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ( Hrithik Roshan )కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకు వార్ 2( War 2 ) అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు.

 Latest Update On Jr Ntr Hrithik Roshans War 2, War 2, Hrithik Roshan, Jr Ntr, To-TeluguStop.com

ఆ సినిమాకు సంబంధించి ఎప్పటినుంచో అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు కూడా వినిపిస్తూనే ఉన్నాయి.

ఇకపోతే ఇటీవల ఎన్టీఆర్ కూడా వార్ 2 కోసం ముంబైలో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం హృతిక్, ఎన్టీఆర్ కలయికలో ఒక యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి.తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో తృప్తి డిమ్రి కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.యానిమల్ సినిమాతో తృప్తి డిమ్రి ఓవర్‌ నైట్ లోనే స్టార్‌గా మారింది.

ఈ క్రమంలోనే తృప్తి డిమ్రి ఇప్పుడు వార్ 2 లో కూడా నటించబోతుంది అన్నమాట.ఏది ఏమైనా ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్‌ కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ షేక్ అయినట్టే.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు టాలీవుడ్ ,బాలీవుడ్ ( Tollywood, Bollywood )అభిమానులు.ఇకపోతే ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే చివరగా త్రిబుల్ ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube