జూనియర్ ఎన్టీఆర్ వార్2 మూవీకి యానిమల్ మూవీకి లింక్ ఇదే.. ఆ బ్యూటీ నటిస్తున్నారా?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ( Hrithik Roshan )కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమాకు వార్ 2( War 2 ) అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు.
ఆ సినిమాకు సంబంధించి ఎప్పటినుంచో అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు కూడా వినిపిస్తూనే ఉన్నాయి.
ఇకపోతే ఇటీవల ఎన్టీఆర్ కూడా వార్ 2 కోసం ముంబైలో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.
"""/" /
ప్రస్తుతం హృతిక్, ఎన్టీఆర్ కలయికలో ఒక యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి.తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో తృప్తి డిమ్రి కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.యానిమల్ సినిమాతో తృప్తి డిమ్రి ఓవర్ నైట్ లోనే స్టార్‌గా మారింది.
ఈ క్రమంలోనే తృప్తి డిమ్రి ఇప్పుడు వార్ 2 లో కూడా నటించబోతుంది అన్నమాట.
ఏది ఏమైనా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ షేక్ అయినట్టే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. """/" /
ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు టాలీవుడ్ ,బాలీవుడ్ ( Tollywood, Bollywood )అభిమానులు.
ఇకపోతే ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే చివరగా త్రిబుల్ ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
ఏ జంతువు పాలు నల్లగా ఉంటయో తెలుసా?