భారత దేశం అనగానే సనాతన సాంప్రదాయలకు, ఆచారాలకు, హైందవ ధర్మానికి, కళలు, సంగీతానికి నెలవైన దేశం.ముఖ్యంగా ఇక్కడ ఉండే పురాతనమైన ఆలయాలు, అప్పటి భారత దేశ వైభవానికి అద్దం పడుతుంటాయి.
ప్రతీ భారతీయుడు ఎంతో గర్వించదగ్గ ఎన్నో క్షేత్రాలు ఇక్కడ నిక్షిప్తమయ్యి ఉంటాయి.ఈ భూమిపై పుట్టి, ఈ మట్టి వాసన పీల్చిన శరీరం ఎక్కడా ఉన్నా సరే ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది.
ఈ దేశం విడిచి ఉన్నత భవిష్యత్తు కోసం విదేశాలు వెళ్ళిన ఎన్నారైలు అక్కడ సైతం భారతీయతను ఏ మాత్రం విడిచిపెట్టలేదు.సనాతన సాంప్రదాయలను గౌరవించుకుంటూనే ఉంటారు.
అమెరికాలో హిందూ దేవాలయాలకు కొదవే లేదు భారతీయులు ప్రాంతాల వారికి కలిసి వారు ఉండే ప్రాంతాలలో ఆలయాలను నిర్మించుకున్నారు.భారత్ లో దేవాలయాలలో జరిగే పూజలు, వ్రతాలు, హోమాలు ఇలా అన్ని రకాలుగా శాస్త్రోక్తంగా, పూజ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే అమెరికాలోని సెయింట్ లూయిస్ లోని హిందూ దేవాలయంలో మహా కుంబాభిషేకం నిర్వహించనున్నారు తెలుగు ఎన్నారైలు.ఈ కార్యక్రమానికి భారీగా నిధులు అవసరమవడంతో ఆలయ కమిటీ నిధుల సేకరణ చేపట్టింది.
మే 11 నుంచీ 15 వరకూ మహా కుంభాభి షేకం జరుగుతుందని, అయితే ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయని స్థానికంగా ఉన్న తెలుగు సమాజాన్ని సమావేశ పరిచి నిధులు కోరడంతో ప్రతీ ఒక్కరూ తమ వంతు సాయం చేసి తమ భక్తిని చాటుకున్నారు.ఈ మొత్తాన్ని లేక్కవేయగా సుమారు రూ.7 కోట్లు పైగానే నిధులు సమకూరినట్టుగా ఆలయ ఛైర్మెన్ శ్రీనివాస రజనీకాంత్ ప్రకటించారు.మే 11 నుంచీ 15 మధ్యలో జరిగే ఈ మహా కుంభాభిషేకానికి ప్రతీ ఒక్కరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదయం చేయాలని కోరారు.