తెలంగాణలో ఎన్నికలపై కిషన్ రెడ్డి క్లారిటీ..!!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది చివరిలో దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలలో…ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం రెడీ అవుతూ ఉంది.

 Kishan Reddy Clarity On Elections In Telangana Details, Bjp, Kishan Reddy, Telan-TeluguStop.com

ఈ క్రమంలో తెలంగాణలో ఎన్నికలు( Telangana Elections ) వాయిదా పడుతున్నట్లు వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో జరగబోతున్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని ప్రచారం జరుగుతోంది.

ఇటువంటి క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో అసెంబ్లీ ఇంకా పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగవని స్పష్టత ఇచ్చారు.

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి అని పేర్కొన్నారు.నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇవ్వడం జరిగింది.జమిలి ఎన్నికలు ఉండబోవు అని క్లారిటీ ఇచ్చారు.

ఈ విషయంలో చాలామంది నాయకులు బ్రమ పడుతున్నారు.అలాంటిదేమీ ఉండకపోవచ్చు అని స్పష్టత ఇచ్చారు.

ఇంకా ఇదే కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్( Prakash Javadekar ) కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తాను గతంలో ఇక్కడ ఇన్ ఛార్జ్ గా పనిచేయడం జరిగింది.

అప్పటి పరిస్థితితో పోల్చుకుంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యం అందరిలో స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube