ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా.? అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి.ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న ఆయన బీజేపీలో చేరడంపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.పొంగులేటి కాంగ్రెస్ వైపు అడుగులు వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే పొంగులేటిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగంగానే పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఖమ్మంలో బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ ఆప్షన్ అనే ఆలోచనలో పొంగులేటి ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని ఐదు సీట్లను తన అనుచరులకు కోరుతున్నట్లు సమాచారం.ఇటీవల బీఆర్ఎస్ బహిరంగ సభ తర్వాత పొంగులేటి తన నిర్ణయాన్ని మార్చుకున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే, పొంగులేటి కాంగ్రెస్ లో చేరతారా.? లేదా.? అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.