పవన్ తో సినిమా చేయాలని ఎదురు చూసే చాలా మంది దర్శకుల కెరియర్ లో సంవత్సరాలకు సంవత్సరాలు వృధా అవుతూ ఉంటాయి.అప్పట్లో సంపత్ నంది మొదలుకొని ఆ తర్వాత పలువురు దర్శకులు పవన్ తో సినిమా లు చేయాలని ప్రయత్నించి, ఆ తర్వాత మరో సినిమా ను చేయడం చూస్తూనే వస్తున్నాం.
హిట్ సినిమా ను అందించిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు.
దాంతో అప్పటి నుండి దర్శకుడు హరీష్ శంకర్ పవన్ డేట్ లు ఎప్పుడెప్పుడు ఇస్తాడా అంటూ ఎదురు చూస్తున్నాడు.
దాదాపు మూడు సంవత్సరాలుగా దర్శకుడు హరీష్ శంకర్ యొక్క సమయం వృధా అయ్యింది.ఈ ఏడాది లో ఆ సినిమా ప్రారంభమవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు.
కేవలం ఈ దర్శకుడు మాత్రమే కాకుండా ఇంకా పలువురు దర్శకులు కూడా పవన్ వల్ల చాలా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అంటూ సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా దాదాపు మూడు సంవత్సరాలుగా లాగబడుతుంది.సాధారణంగా దర్శకుడు క్రిష్ కేవలం ఆరు నెలల్లో సినిమా ను పూర్తి చేయగలడు, కానీ పవన్ కళ్యాణ్ డేట్ లు ఇవ్వక పోవడం తో హరి హర వీరమల్లు సినిమా చాలా ఆలస్యం అవుతుంది అంటూ మేకర్స్ ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.

ఇంకా పలువురు దర్శకుల యొక్క విలువైన సమయాన్ని పవన్ కళ్యాణ్ తన రాజకీయాల కారణంగా వృధా చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీలో ఒక వర్గం వారు కామెంట్స్ చేస్తున్నారు.సినిమాలకు డేట్లు ఇస్తే వాటిని సరిగా దర్శకులు ఉపయోగించుకునే విధంగా ఇవ్వాలని, వాళ్ల సమయం వృధా చేయకూడదని కొందరు పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేస్తున్నారు.ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసి అయినా ఒక్క సినిమాను ఆయనతో తీయాలని ఎంతో మంది దర్శకులు కోరుకుంటూ ఉంటారు.







