టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్( Jani Master ) ఒకరు కాగా ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఎన్నో అవార్డులను సైతం గెలుచుకున్నారు.అయితే ఒక వివాదం వల్ల జానీ మాస్టర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.
అయితే జానీ మాస్టర్ కు అవకాశాలు ఇవ్వద్దంటూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం జానీ మాస్టర్ కేసును నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ( Kethireddy Jagadishwar Reddy )తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నారు.ఆయన మాట్లాడుతూ జానీ మాస్టర్ కు ప్రకటించిన జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్ ను విచారణ ముగిసే వరకు ఆపాలని కామెంట్లు చేశారు.
ఇలాంటివి జరిగిన సమయంలో స్పందించడం మాత్రమే కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఇండస్ట్రీ పెద్దలు అడుగులు వేయాలని కోరారు.
షూటింగ్స్ జరిగే ప్రదేశాలలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా వేధింపులు ఉండకుండా చేయాలని ఆయన తెలిపారు.లైంగిక వేధింపుల కేసు తేలేవరకు జానీ మాస్టర్ కు మూవీ ఆఫర్లు సైతం ఇవ్వవద్దని కేతిరెడ్డి తెలిపారు.జానీ మాస్టర్ ను డాన్స్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవి నుంచి తొలగించాలని కేతిరెడ్డి కామెంట్లు చేశారు.
కేతిరెడ్డి చేసిన కామెంట్లు ఒకింత సంచలనం అవుతున్నాయి.జానీ మాస్టర్ ఇప్పటివరకు ఈ వివాదం గురించి నోరు మెదపలేదనే సంగతి తెలిసిందే.
జానీ మాస్టర్ సైలెన్స్ వల్ల ఈ వివాదం అంతకంతకూ పెద్దవుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.జానీ మాస్టర్ కెరీర్ కు వివాదం వల్ల ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జానీ మాస్టర్ ఈ వివాదం నుంచి బయటపడతారో లేదో చూడాల్సి ఉంది.