కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం,ఆ నాలుగు రాష్ట్రాల ప్రజలకు నో ఎంట్రీ

లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న ఈ సమయంలో కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.గత రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను ఈ నెల 31 వ తేదీవరకు పొడిగిస్తూ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకోగా,అంతర్జాతీయ,రాష్ట్రీయ ప్రయాణం పై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది.

 Karnataka Lockdown Order Bans People From 4 States, Lock Down, Karnataka Govern-TeluguStop.com

లాక్ డౌన్ నిబంధనలను సడలించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయాణాలపై నిర్ణయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశాయి.ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 31 వరకు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వచ్ఛే అంతర్జాతీయ, రాష్ట్రీయ ప్రయాణికులను రాష్ట్రంలోకి అనుమతించరాదని నిర్ణయం తీసుకుంది.వీరి తరలింపు ఆయా రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే జరగాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కర్ణాటక సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.మరోవైపు కర్ణాటకలో పలు ఆంక్షలను సడలించారు.

భౌతిక దూరం పాటింపు నిబంధనలతో అన్ని రైళ్లను, బస్సులను అనుమతించనున్నారు.బస్సుల్లో 30 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

మంగళవారం నుంచి ఉబేర్, ఓలా ట్యాక్సీ సర్వీసులను, పార్కులను కూడా అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఇక ఆదివారాల్లో మాత్రం అత్యవసర సర్వీసులు మినహా అన్నింటిపైనా లాక్ డౌన్ ఆంక్షలను ఖఛ్చితంగా అమలు చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube