నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్ వైరల్!

సినిమాల కంటే వివాదాల ద్వారానే కొంతమంది సెలబ్రిటీలు ఊహించని స్థాయిలో పాపులర్ అవుతుంటారు.అలా ఈ మధ్య కాలంలో వివాదాల ద్వారా పాపులర్ అవుతున్నారు.

 Karate Kalyani Shocking Comments Goes Viral In Social Media Details Here ,karat-TeluguStop.com

తాజాగా కరాటే కళ్యాణి( karate kalyani ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు కరాటే కళ్యాణి ఆటంకాలు క్రియేట్ చేశారు.

సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా గత నెల 28వ తేదీన ఆవిష్కరించాల్సి ఉండగా కరాటే కళ్యాణి క్రియేట్ చేసిన ఇబ్బందుల వల్ల ఆ పనులు అనుకున్న విధంగా జరగలేదు.అయితే తనకు ప్రాణాహాని ఉందంటూ తాజాగా కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేశారు.

తనను చంపేందుకు కొంతమంది ప్లాన్ చేస్తున్నారని ఆమె వెల్లడించడం గమనార్హం.

Telugu Jr Ntr, Karate Kalyani, Khammam, Lord Krishna, Sr Ntr, Tollywood-Movie

నా కారు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారని తాను కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక కారు టైర్ పేలిందని ఆమె చెప్పుకొచ్చారు.నా మీద ఉండే కోపం వల్లే కారు టైర్లను ఎవరో కోసేశారని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. ఖమ్మం( Khammam )లో రాజకీయం జరుగుతోందని ఈ గొడవకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Jr Ntr, Karate Kalyani, Khammam, Lord Krishna, Sr Ntr, Tollywood-Movie

సీనియర్ ఎన్టీఆర్ ( N.T.Rama Rao )కు దైవత్వాన్ని ఆపాదించాలనే ఆలోచనతో కొంతమంది కృష్ణుని రూపంలో విగ్రహాలను పెట్టాలని ప్రయత్నాలు చేశారని ఆమె అన్నారు.కృష్ణుని రూపంలో మనుషుల విగ్రహాలు పెట్టడం సరికాదని కృష్ణునికి ఒక రూపం ఉందని కరాటే కళ్యాణి పేర్కొన్నారు.

అయితే కరాటే కళ్యాణిపై సోషల్ మీడియాలో నెగిటివిటీ మాత్రం పెరుగుతోంది.అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోవడం ఆమెకు అతిపెద్ద మైనస్ అవుతోంది.కరాటే కళ్యాణి ఇకనైనా వివాదాలకు దూరంగా ఉండాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube