నందమూరి బాలకృష్ణ( Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth kesari movie ) లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెల్సిందే.ఈ సినిమా కాజల్ కి రీ ఎంట్రీ మూవీ అని కూడా అనవచ్చు.
ఎందుకంటే పెళ్లి, ఆ తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ అగర్వాల్( Kajal agarwal ) సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.ఆమె రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్న సమయంలో పలు ఆఫర్లు వచ్చాయి.
అయితే ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన ఆఫర్లను ఆమె కాదంటూ కేవలం బాలయ్య కు జోడీగా భగవంత్ కేసరి సినిమా( Bhagavanth kesari movie ) లో నటించేందుకు ఓకే చెప్పింది.గతం లో బాలయ్య కు జోడీగా నటించే అవకాశాలు రెండు మూడు సార్లు వచ్చినా కూడా కాజల్ నో చెప్పింది.అయితే ఈసారి ఆమె కి పెద్ద సినిమా ల ఆఫర్లు లేకపోవడం తో పాటు, తనకు ఇది రీ ఎంట్రీ అవ్వడం వల్ల బాలయ్య తో సినిమా ను చేసేందుకు ఓకే చెప్పి ఉంటుందని కొందరు అంటున్నారు.ఆ విషయం పక్కన పెడితే భగవంత్ కేసరి సినిమా లో కాజల్ అగర్వాల్( Kajal agarwal ) పాత్ర లిమిటెడ్ వర్షన్ అన్నట్లుగా ఉంటుంది అనేది చాలా మంది టాక్.
ఇప్పటి వరకు కాజల్ అగర్వాల్ ఎంత సమయం ఈ సినిమా లో కనిపించబోతుంది అనేది ఏ ఒక్కరికి కూడా క్లారిటీ లేదు.
కానీ తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం సినిమా లో కాజల్ అగర్వాల్ ( Kajal agarwal )పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లి పోయేది ఏమీ కాదు.జైలర్ సినిమా లో తమన్నా హీరోయిన్ అన్నారు.కానీ ఆ సినిమా లో తమన్నా కనిపించేది కేవలం ఒక పాట లో ఆ తర్వాత అయిదు నిమిషాల స్క్రీన్ ప్రజెన్స్ మాత్రమే.
కానీ కాజల్ ఈ సినిమా లో అలా కాదు.ఒక ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్ర లో కాజల్ నటించినట్లుగా సమాచారం అందుతోంది.ఈ సినిమా హిట్ అయితే తప్పకుండా కాజల్ కి మంచి హైప్ మరియు కెపీర్ పై హోప్స్ ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.