తారక్ మొదటి సినిమా పారితోషికం ఏం చేసాడో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా అడుగు పెట్టినప్పటికీ తన టాలెంట్ తో ఇప్పుడు టాప్ హీరోల లిస్టులో ఒకరిగా ఉన్నారు ఎన్టీఆర్.ఎన్టీఆర్ అంత ఈజీగా టాప్ హీరో అయిపోలేదు.

 Jr Ntr First Movie Remuneration, Ntr, Remuneration,ntr First Movie,rrr, Ram Char-TeluguStop.com

మొదట్లో ఆయనను చాలా విమర్శించారు.ఎన్ని విమర్శలు చేసిన ఎన్టీఆర్ పట్టించుకోలేదు.

ఆయన సినిమాలతోనే అందరికి సమాధానం చెప్పారు.
ఆయన 17 సంవత్సరాల వయసులోనే మొదటి సినిమా స్టార్ట్ చేసి అతనికి 18 సంవత్సరాల వయసు వచ్చాక ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు.

కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు.ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 2 దశాబ్దాలు అవుతుంది.ఇప్పుడు టాప్ హీరోగా ఉన్నారు కాబట్టి ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.

పారితోషికం లాభాల్లో వాటాను కలిపి మొత్తం ఈ సినిమాకు దాదాపు 50 కోట్లు వరకు అందుకుతున్నాడని సమాచారం.

ఇప్పుడు ఇంత రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్ తన మొదటి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నాడో మీకు తెలుసా.తారక్ మొదటి సినిమాకు అక్షరాల నాలుగు లక్షల రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్నాడు.

అంతేకాదు అంత చిన్న వయసులోనే తారక్ హీరో అవ్వడంతో ఆ వయసులో ఆ డబ్బును చూసి చాలా ఆనంద పడిపోయేవాడట.ఆ డబ్బును చాలా సార్లు లెక్కపెట్టుకుని సంతోషించేవాడట.

మొదటి సినిమాకు అందుకున్న పారితోషికాన్ని వాళ్ళ అమ్మ చేతిలో పెట్టాడట.ఇప్పుడు 50 కోట్లు అందుకుంటున్న తారక్ అప్పట్లో 4 లక్షలు అందుకున్నాడు.

ఎంతైనా మొదటి సంపాదన ఎవరికీ ఆనందం కలిగించదు చెప్పండి.
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube