ఎన్టీఆర్ దేవర మూవీ సెన్సార్ కట్స్ వివరాలు ఇవే.. బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) హీరోగా నటించిన తాజా చిత్రం దేవర.( Devara ) ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

 Jr Ntr Devara Movie Censor Cuts List, Jr Ntr, Devara Movie, Censor Cuts Lits,-TeluguStop.com

కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది.ఈ సినిమా ఈనెల 27న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు.

ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Telugu Censor Lits, Devara, Jr Ntr, Jrntr-Movie

ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇక విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తున్నారు.ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి అయ్యిందట.

అయితే ఈ సినిమా సెన్సార్ లో సెన్సార్ యూనిట్ కట్స్ చెప్పిన సీన్స్ తెలుస్తున్నాయి.వాటిలో ఒకతను తన భార్య కడుపు మీద తన్నే సీన్ ఒకటి, అలాగే కుంజర అనే అతని కొడుకు తన తల్లిని కొట్టే సీన్ ఇంకా కత్తికి వేలాడదీసిన ఒక బాడీ సీన్ ఫైనల్ గా సొర చేప విజువల్ లో సిజిఐ మార్క్ వేయలేదని ఈ నాలుగు సీన్స్ కట్స్ చెప్పారట.

Telugu Censor Lits, Devara, Jr Ntr, Jrntr-Movie

ఇలా టోటల్ గా 7 సెకండ్స్ కట్స్ లో 2 సెకండ్స్ రీప్లేస్ చేసినట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమాని నిడివి ఎక్కువగా ఉండడంతో కొన్ని సన్నివేశాలను చిత్ర బృందం తగ్గించారు.మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.ఇకపోతే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.త్రిబుల్ ఆర్ రేంజ్ రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు.మరి భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube