వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ అవుతోందా.. బాలయ్య బాబీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తారా?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు( Balayya Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Balakrishna Teaming With Gopichand Malineni, Balakrishna, Gopichand Malineni, To-TeluguStop.com

ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలో అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.కాగా బాలయ్య బాబు తన గత మూడు సినిమాలతో హ్యాట్రిక్ ను అందుకున్న విషయం తెలిసిందే.

అలా అటు రాజకీయపరంగానే కాకుండా ఈ సినిమాల పరంగా కూడా బాలయ్య బాబు మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు.ఇకపోతే బాలయ్య బాబుతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు రెడీగా ఉన్నారు.

Telugu Balakrishna, Repeat, Tollywood-Movie

ముఖ్యంగా మాస్ దర్శకుడు దొరికితే బాక్సాఫీస్( box office ) షేక్ అవడం ఖాయం ఆనందంలో ఎటువంటి సందేహం లేదు.బాలయ్య బాబుకు ఎమోషనల్ సినిమాల కంటే ఎక్కువగా మాస్ సినిమాలు బాగా సెట్ అవుతాయని చెప్పవచ్చు.ఈ మధ్యకాలంలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి ( Simha, Legend, Akhanda, Veerasimha Reddy )సినిమాలు చూస్తే మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ కాంబో లు గుర్తుకు వస్తాయి.గత ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో గోపీచంద్ మలినేని బాలయ్య తో మాస్ హిట్ కొట్టాడు.

వీరసింహారెడ్డి మూవీలో బాలయ్య మాస్ లుక్స్ పై నందమూరి అభిమానులే కాదు మాస్ ఆడియన్స్ అంతా తెగ ఇంప్రెస్స్ అయ్యారు.వీరసింహారెడ్డి సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అవడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు.

Telugu Balakrishna, Repeat, Tollywood-Movie

ఇప్పుడు మరోసారి వీరసింహారెడ్డి కాంబో రిపీట్ కాబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వీరసింహారెడ్డి తర్వాత గోపిచంద్ మలినేని రవితేజ తో సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉంది.కానీ రవితేజని తప్పించి బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ని మైత్రి మేకర్స్ తెరపైకి తీసుకొచ్చారు.బాలయ్య కూడా బాబీ తో NBK109 చేస్తున్నారు.తర్వాత ఆయన అఖండ 2 చెయ్యాల్సి ఉంది.మరి ఎప్పుడు గోపీచంద్ బాలయ్య బాబుతో మూవీ చేస్తారో, వీరసింహారెడ్డి కాంబో ఎప్పటికి రిపీట్ అవ్వుద్దో అని నందమూరి అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే మరోసారి బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube