అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు భారతీయుల శక్తి సామర్ధ్యాలపై బాగా గురి కుదిరినట్లుగా కనిపిస్తోంది.అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కీలక పదవులకు ఇండో అమెరికన్లను ఎంపిక చేస్తున్న ఆయన.
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు భారత సంతతి మహిళలను ఉన్నత పదవులకు నామినేట్ చేశారు.వైట్‌హౌస్ సైన్స్ సలహాదారుగా ఇండో అమెరికన్ , భౌతిక శాస్త్రవేత్త ఆర్తి ప్రభాకర్‌ను జో బైడెన్ నామినేట్ చేసిన ఆయన 24 గంటలు గడవకముందే.
మరో భారత సంతతికి చెందిన అంజలీ చతుర్వేదికి కీలక బాధ్యతలు కట్టబెట్టారు.వెటరన్స్ అఫైర్స్ విభాగంలో జనరల్ కౌన్సెల్‌గా ఆమెను నామినేట్ చేశారు బైడెన్.
వైట్‌హౌస్ వెబ్‌సైట్ పేర్కొన్న ప్రకారం.యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లోని క్రిమినల్ విభాగంలో అంజలి డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు.
తన కెరీర్‌లో ఆమె ప్రభుత్వంలోని మూడు శాఖలలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేశారు.ప్రభుత్వ విభాగాల్లోకి రావడానికి ముందు.
ఆమె నార్త్‌రోప్ గ్రుమ్మన్ కార్పోరేషన్‌కు అసిస్టెంట్ జనరల్ కౌన్సెల్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా పనిచేశారు.ఈ హోదాలో కంపెనీ గ్లోబల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు నాయకత్వం వహించారు.
అలాగే బ్రిటీష్ పెట్రోలియంలో అసిస్టెంట్ జనరల్ కౌన్సెల్‌గా, నిక్సన్ పీబాడీకి చెందిన వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న న్యాయ సంస్థలో పార్ట్‌నర్‌గా పనిచేశారు.
న్యూయార్క్‌లోని కోర్ట్‌ల్యాండ్‌లో జన్మించిన అంజలి చతుర్వేది తొలి తరం అమెరికన్.
జార్జ్‌టౌన్ యూనివర్సిటీ లా స్కూల్ , కార్నెల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు.సర్టిఫైడ్ యోగా టీచర్, లీడర్‌షిప్ కోచ్‌గా కూడా పనిచేశారు.
ఆమె తన భర్త, కుమారుడితో కలిసి చెవీ చేజ్‌లో నివసిస్తున్నారు.ఇకపోతే.
మంగళవారం వైట్‌హౌస్ చీఫ్ అడ్వైజర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా నామినేట్ అయిన ఆర్తి ప్రభాకర్ కుటుంబం .ఢిల్లీ నుంచి అమెరికాకు వలస వెళ్లింది.తొలుత చికాగోకు అనంతరం టెక్సాస్‌కు వీరి ఫ్యామిలీ మకాం మార్చింది.టెక్సాస్ టెక్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందిన ఆర్తి ప్రభాకర్.కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లయిడ్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ అందుకున్నారు.ఇదే సంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ పూర్తి చేశారు.అనంతరం ఆఫీస్ ఆఫ్ టెక్నాలజీ అసెస్‌మెంట్‌లో కాంగ్రెషనల్ ఫెలోగా లెజిస్లేటివ్ శాఖలో ఆర్తి ప్రభాకర్ తన కెరీర్‌ను ప్రారంభించారు.1993లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ హయాంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్స్ అండ్ టెక్నాలజీ సంస్థకు చీఫ్‌గా పని చేశారు.ఆ తర్వాత 2012 నుంచి 2017 వరకు యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీకి హెడ్‌గా విధులు నిర్వహించారు.
.