లావుగా ఉన్న వాళ్లకు అదిరిపోయే ఆఫర్‌.. గంటకు రూ.1300!

ఓ సంస్థ లావుగా ఉన్న వాళ్లకు అదిరిపోయే ఆఫర్‌ ఇస్తోంది.వారికి గంటకు రూ.1300 జీతంతో ఉద్యోగం కల్పిస్తోంది.దీనికి 18 ఏళ్లు పైబడి 199 కిలోల బరువు ఉన్నవారు అర్హులు.

 Japan Company Offering Jobs To Fat Persons, Japan, Plus Size, Fat Body, Japan, J-TeluguStop.com

అయితే, ఈ జాబ్‌ ఎక్కడా? ఎవరు ఇస్తున్నారు? దీనికి మనం ఏం చేయాలి? ఆ వివరాలు తెలుసుకుందాం.అసలు అంత లావు ఉంటే వారికి సామాన్యంగా పని చేత కాకపోవచ్చు.

కానీ, ఇలా పిలిచి మరీ ఉద్యోగం ఇవ్వటమేంటి అంటారా? అది కూడా ఎక్కువ జీతం ఆఫర్‌ చేస్తోంది.కానీ, ఇది మన భారత్‌లో కాదులేండి! ఇది జపాన్‌లో.అక్కడ ఇలాంటి వింతలు చోటు చేసుకోవడం సాధారణం.ఎప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నించడం వారికి కామన్‌.

మరీ ఏకంగా మనుషులనే అద్దెకు ఇస్తోంది ఒక కంపెనీ.అంతే కాదు వాళ్లు లావుగా ఉండాలని రూల్‌ పెడుతోంది.అలా ఉన్నవారికి ఉద్యోగం రెడీ.జీతం గంటకు 18 డాలర్లు.అంటే మన కరెన్సీ ప్రకారం రూ.1300.జపాన్‌లో ప్లస్‌ సైజ్‌ఫ్యాషన్‌ బ్రాండ్‌ను నిర్వహిస్తున్న బ్లిస్‌కు చెందిన ‘క్విజల్లా’నే ఈ కొత్త సర్వీసును తీసుకొచ్చింది.దీని పేరు డెబుకరీ.తమ బ్రాండ్‌ ప్రచారం కోసం ప్లస్‌ సైజ్‌ మోడల్స్‌ దొరకకపోవడంతో బ్లిస్‌ ఈ తరహాలో ఆలోచన చేశారని కంపెనీ వెబ్‌సైట్‌ చెబుతోంది.

డెబుకరీ సంస్థను 2017లో 45 మందితో బ్లిస్‌ ఏర్పాటు చేశారు.

వాళ్లంతా క్విజల్లా కస్టమర్లే.దీని కోసం బ్లిస్‌ ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించి ప్రజలను ఆహ్వానించినప్పుడు వీరు చేరారు.

అయితే బ్లిస్‌ ఈ ఆలోచనను విస్త్రతి చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో తమ దగ్గరున్నమోడళ్లను అద్దెకు ఇస్తామని ప్రకటించారు.ఒక్కో మోడల్‌ కోసం గంటకు 2000 యెన్‌ లు చెల్లించాల్సి ఉంటుంది.అంటే ముందుగా మనం చెప్పుకున్నట్లు గంటలకు సుమారు రూ.1300.అయితే, ఇలా లావుగా ఉన్న వారు ఏం చేస్తారంటే.బ్లిస్‌ లాగే ఎవరైనా ప్లస్‌ సైజ్‌ ఫ్యాషన్‌ నిర్వహించేవాళ్లు వీళ్లను అద్దెకు తీసుకోవచ్చు.అది కాకుండా డైట్‌ ప్లాన్‌ కు సంబంధించి షోస్, యాడ్స్, ప్రోగ్రామ్స్‌ చేసేవాళ్లు కూడా వీళ్లను అద్దెకు తీసుకోవచ్చని సంస్థ చెబుతోంది.

Telugu Fat, Japan, Job-Latest News - Telugu

ఈ సంస్థ పిలుపునకు ప్రజల నుంచి మంచి స్పందనే వస్తోంది.అంతే కాదు ప్రతిరోజూ జపాన్‌ లోని వివిధ నగరాల నుంచి అప్లికేషన్లు వస్తున్నాయని డెబుకరీ చెబుతోంది.అయితే, ఈ జాబ్‌లో చేరాలంటే రెండు అర్హతలు ఉండాలి.

ఒకటి ఆ వ్యక్తికి 18 ఏళ్లు నిండి ఉండాలి.రెండోది 100 కిలోలకుపైగా బరువు ఉండాలి.

వీళ్లను అద్దెకు ఇవ్వడం వల్ల వచ్చే 2000 యెన్‌ల డబ్బును మెడల్స్‌కే ఇచ్చేస్తున్నారు.సంస్థ నుంచి వచ్చే కమిషన్‌ను మాత్రమే డెబుకరీ తీసుకుంటున్నారు.

టోక్యో, ఒసాకా లాంటి నగరాల్లో ప్రస్తుతం డెబుకరీ సేవలు అందిస్తోంది.త్వరలో మిగిలిన ప్రాంతాలకు ఈ సర్వీసులు పెంచుతారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube